Header Banner

పి ఆర్ కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభం! కార్మికులతో మేడే సంబరాలు!

  Thu May 01, 2025 17:47        Politics

పి ఆర్ కె ఫౌండేషన్ అధినేత, గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పారా రామకృష్ణ గన్నవరం పట్టణంలో పలుచోట్ల చలివేంద్రాలు ప్రారంభించారు.

 

ఈ వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన, పట్టణ ప్రజల దాహార్తి తీర్చడం కొరకు పి ఆర్ కె ఫౌండేషన్ అధినేత పారా రామకృష్ణ గన్నవరం పట్టణంలో చలివేంద్రాలను నెలకొల్పారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా మేడే సందర్భంగా స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర, కార్మికులు సిపిఎం జెండా ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో పి ఆర్ కె ఫౌండేషన్ అధినేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పారా రామకృష్ణ పాల్గొని కార్మికులతో చర్చించారు.

 

ఇది కూడా చదవండిక్రీడాకారులకు గుడ్‌న్యూస్‌! డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ విడుదల!

 

అనంతరం కోనాయి చెరువు దగ్గర ఉన్న శివాలయంలో శివయ్యను దర్శించుకుని, ముందుగా దేవాలయం ప్రక్కన చలివేంద్రం ప్రారంభించి, అందరికీ మజ్జిగ పంపిణీ చేశారు.

 

అనంతరం స్థానిక తాహసిల్దార్ కార్యాలయం దగ్గర, గన్నవరం బస్టాండ్ ప్రక్కన, దావాజీ గూడెం రోడ్డు, వెంకటేశ్వర ధియేటర్ ఎదురుగా చలివేంద్రాలను ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరం పట్టణం చుట్టుప్రక్కల గ్రామాల నుండి పనుల నిమిత్తం, వ్యాపార అవసరాల నిమిత్తం చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు, ప్రయాణిస్తూ ఉంటారని,అసలే ఇది వేసవికాలం, పైగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వలన మన పి.ఆర్.కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోనాయి చెరువు, శివాలయం దగ్గర, స్థానిక తహసిల్దార్ కార్యాలయం దగ్గర, గన్నవరం బస్టాండ్ ప్రక్కన, దావాజీ గూడెం రోడ్డు, వెంకటేశ్వర థియేటర్ ఎదుట చలివేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో గన్నవరం గ్రామపంచాయతీ సర్పంచ్ నిడమర్తి సౌజన్య నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మోర్ల నాగబాబు, తంగిరాల శ్రీనివాసరావు, మల్లీశ్వరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షులు ధనియాల నాగరాజు, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PRKFoundation #ParaRamaKrishna #Gannavaram #SummerRelief #Chalivendram